నువ్వెళ్ళిపో గులాబీ!

నువ్వెళ్ళిపో గులాబీ
నాకు "మైదానం" సోమక్క ఉంది...
నన్ను నా టపాల్ని లెక్కపెట్టుకోనీ
సోమక్కకు తర్ఫ్జీదివ్వనీ
నువ్వు సిగ్గువిడిచి రాసిన నేలబారు ఆహాలను ఓహోలను
చెల్లాచెదరైన ఆ వ్యాఖ్యల్ని ఎక్కడ తోసేశానో చూడనీ
హమ్మయ్య! దొరికాయి. అవింకా చెత్తగానే ఉన్నాయి
బయట సోమక్క ఎదురుచూస్తోంది
మరో టపాకు వేళయింది
నువ్వెళ్లిపో గులాబీ

(మూలం: కత్తి ముల్లిగాన్)

0 comments:

Post a Comment