కత్తి వ్యధ - కూడలి మాంసం

The following post was written by Naresh 1.0. Thank you Naresh, for backing me up. I was a bit busy :)



కూడలి ప్రజలకు శుభవార్త...త్వరలో పానశాల, కాగడా ధరలు ఆకాశానికంటి ఆదివారమైనా పొట్టచెక్కలవ్వని పరిస్థితి రానుంది.
కూడలిలో వీవెన్ ప్రభుత్వం పానశాలపై బ్యాన్ విధించింది.
ఒక అడుగు ముందేసి పానశాల ఉన్నా,తిన్నా, అమ్మినా దాన్ని నేరంగా పరిగణిస్తూ ఏడుసంవత్సరాల వరకూ శిక్షను ప్రతిపాదించింది.
ఈ బ్యాన్ అప్రజాస్వామికం అన్న ప్రతిపక్షాలకు వీవెన్ ఇచ్చిన సమాధానం "రాష్ట్రంలోని పర్ణశాలను కాపాడాలంటే ఈ చట్టం తప్పదు"ఆని.
నిజమే...ఎకలాజికల్ సమతౌల్యాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న చాలా విపరీతమైన పరిణామాల్ని అడ్డుకోలవసిందే.
దానికి మురికీ, చెత్తా, కంపూ,కుళ్ళూతో పాటూ పర్ణశాలను కూడా భరించాల్సిందే.
కానీ ఈ నిర్వచనంలో వచ్చే ‘freedom of expression’లో కాగడా, పానశాల, ప్రమాదవనం, కూడా వస్తాయి.
కానీ చిత్రంగా ఈ కూడలి వీవెన్ ప్రభుత్వానికి ఇవేమీ కనిపించలేదు.
కేవలం "పానశాల" మాత్రమే కనిపించింది.
నిజానికి ఇప్పటికే అమలులో ఉన్న Prevention of Laughter and Parody Act, 1964 మరింతగా ఉపయోగరమనే వాదన ఉంది.
ఎందుకంటే, అందులో నవ్వులతోపాటూ పేరడీలు చేసి చంపడాన్ని చట్టవ్యతిరేకంగా పరిగణించింది.
సమస్య పర్ణశాల దుర్గందం అనేవాదన కొందరు వినిపించినప్పటికీ అతికి పోనంతవరకూ freedom of expression ని ఎవరూ చంపరనే ఇంగితజ్ఞానం చాలు ఈ వాదనకు చుక్కలు చూపించడానికి.
మొత్తానికి వీవెన్ ప్రభుత్వం తన bigotry అజెండాని ముందుపెట్టి ముఠాల్ని, కులపిచ్చి మైనారిటీలను సంతృప్తిరిచే బాటపట్టింది.
కామెడీని ఎంజాయ్ చేసే మెజారిటీ బ్లాగర్లని బుజ్జగించకుండానే కంపురాతలు రాసే కులవాదులు, దేశద్రోహులూ, విదేశీ తొత్తులని విజయవంతంగా ఈ బ్యాన్ తలమీద పెట్టుకుంది.
మరీ ముఖ్యంగా కామెడీలు, పేరడీలు సొంతంగా రాసుకోలేని పేదకు అందుబాటులో ఉండే పౌష్టికాహారమైన కామెడీ బ్లాగుల్ని చట్టవ్యతిరేకం చెయ్యడం ద్వారా ఈ కూడలి సాధించిందేమిటో ప్రశ్నార్థకమే.
ఇలాంటి కేసుల్లో ఏడుసంవత్సరాల జైలు శిక్ష ప్రతిపాదించడం మరో హాస్యాస్పదమైతే తలాతోకా లేని ఈ చట్టం ద్రోహులు హిడెన్ అజెండాని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి భవిష్యత్తులో రాజకీయంగా పనికొస్తుందనుకునే వీవెన్ తెలివితక్కువతనం మరో జోకు.

0 comments:

Post a Comment