ఆమె ఉమ్మేసిన రోజుఆమె ఉమ్మేసిన రోజు 
నా ముఖాన్ని తుడిచేసుకున్నాను 
ఇంట్లోకి పరిగెత్తాను
విలువలతో పాటు వలువలని కూడ జారవిడిచాను
పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలిచాను
(లేక నేను నిలిచిన తర్వాత పగిలిందో!)
నా మీద నాకే అసహ్యం! 
హుందాగా నా ప్రతిబింబాన్ని "మూర్ఖుడా" అని తిట్టాను
కనీస సభ్యతకి "తూచ్" అన్నాను
బాత్రూము నుంచి బెడ్రూము వరకూ చెప్పులులేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న వస్తువులను తన్నుకున్నాను
షవరు వేడిలో నా మెదడుని చిన్నప్పుడే తినేసిన నీటికి
ఇంకా ఏమి తినే కోరికో?
లేదా,మందమతినైన నాలో పుట్టే స్వేదమో
నేనొక భావ దరిద్రుడిని - ప్రశ్నేలేదు
ఇక ఆమేది, ఆమే పూజించే దేవతది నగ్న చిత్రాన్ని ఊహించుకునేదెట్లా 
ఆమె ఉమ్మేసిన రోజు 
నా ముఖాన్ని తుడిచేసుకున్నాను


స్వాహిళీ మూలం: సోమ్ దేవ్ డమాళ్
ఆంగ్లానువాదం:  కత్తి మాత్రే
తెలుగు సేత: కత్తి ముల్లిగాన్


(హృద్యమైన కపి-త ను అనువదించి పానశాలకు పంపిన ఓరెగాన్ ఓబులేసు కు అభినందనలు)

0 comments:

Post a Comment