అసహ్యపు రాతలు


రాయడం అలవాటైన తర్వాత ఆపడం కష్టం.  రాసేది నిఖార్సయిన చెత్త అయితేనేమి.
రాసింది గూగుల్ చాట్ లో అందరికీ పంచి కామెంట్ రాయమని అడుక్కోటం మొదలైన తర్వాత, కాలేజీ వెకిలి వేషాలూ, ఒన్ సైడు ప్రణయ విలాసాలూ, సినిమాలు, చలంగాడి పుస్తకాలు అయ్యాక, పై పై మెరుగులు తరిగిపోయాక.. అసహ్యంగా రాయకుండా నియంత్రించుకోవటం మహా కష్టం.
ప్రస్తుతం ఆ అసహ్యపు రాతల్లో పడ్డాను.
హిందువులపై ద్వేషంతో రాయడం, కుతి తీర్చుకోవాలని రాయడం, చిన్నప్పుడు చలం పుస్తకాల్లో, తాపీ ధర్మారావు ప్రేలాపనల్లో, రోమిల్లా థాపర్ మేధోభావప్రాప్తుల్లో పోగొట్టుకొన్న నా అస్తిత్వాన్ని సిల్లీ బ్లాగుల్లో వెదుక్కోవడం కోసం రాయడం.. ఇవన్నీ అసహ్యపు రాతలే.
అసహ్యంగా రాయకపోతే కొన్నేళ్ళ తరువాత నా నిస్సారమైన జీవితాన్ని తిరిగి చూసుకుని, ఏం కనిపించక "నా అస్తిత్వాన్ని నేనే నిరాకరించుకున్నా" అంటూ నామీద నేనే అంతరాత్మ కోర్టులో కేసెయ్యాలి. కనీసం రాస్తే జనం మీద అట్రాసిటీ కేసైనా వెయ్యొచ్చు. ఏమో, గుర్రమెగురా వచ్చు తరహాలో కేసు గెలువా వచ్చు!

కాకపోతే ఒక్క నిజం. 
"రాయడానికి టాపిక్కుల్లేవు, టాపిక్కుల్లేవు" అని బ్లాగులోళ్ళు అనడం శుద్ధ అబద్ధం.
గుడిమీద బొమ్మా, కాలేజిలో ఫంక్షన్లో బీఫు స్టాలు, చెప్పులమీద దేవతల బొమ్మలు, రాముడికీ సీతకూ మధ్య లింకూ, విష్ణువు ఎడమచేతిలో కనిపించనిమూటలో చిల్లరా.. ఇలా చెప్పుకుంటే పోతే ఇంకెన్నో.. ఇవన్నీ సంచలన టపాలకు పనికిరావని బ్లాగోళ్ళ నమ్మకం.
అసలు రాయటం చేతగాని వీళ్ళ చేతగానితనం, నావంటి వారి చైతన్యస్రవంతిని అందుకోలేని మూర్ఖత్వం, వీళ్ల అసమర్థతను అస్సలు ఒప్పుకోరే.
సరే, పుట్టుకతో జ్ఞానినీ, వీర ఫండమెంటల్ హ్యూమనిస్టిక్ టెర్రరిస్ట్ ని అయిన నేను కొత్తగా వీటిని రాసి చూపిస్తే, "మనోభావాలు గాయపరచుకుందాం రా" అని రమణగోగుల ట్యూన్ లో ఆరున్నొక్కరాగం అందుకుంటారు. వీళ్లనెలా బాగుచెయ్యాలా అని మరో సందేహం.
నిజమే... మనం దేవునిచే ఎన్నుకోబడ్డ మెసయ్యాలం.. మనకివి సులభంగా అర్థమవుతాయి గానీ, ఈ మూఢులు మనస్థాయికి ఎదిగేపనేనా?
ఒకవేళ నా అనుచరగణానికి అర్థం అయినా...నా మేరునగమేధస్సు వల్ల వాళ్ళకు బ్లాగేజి(బ్లాగు మైలేజి) వస్తే? అనేది మరో ధర్మసంకటం. అన్నట్టు ధర్మం అంటే గుర్తొచ్చింది. ధర్మం కూడా ఈ ఫ్యూడల్ వ్యవస్థలో భాగమే. రాజ్యాంగంలో ఏప్రకరణంలోనూ లేని ఈ "ధర్మం" అనే భావనను రాజ్యాంగాన్ని విశ్వసించే బాధ్యతగల పౌరునిగా నేను తక్షణం విసర్జించాలి.
ఇదేమీ ధర్మసంకటం కాదు. నిజానికి ఇదో చచ్చుసంకటం.
ఏ టపా ఎక్కువ సెన్సేషనల్ అని ఎవడు చెప్పగలడు ఈ బ్లాగ్పరిశ్రమలో?
తిమ్మిని బమ్మిని చేయాలి. మూడే కాళ్లురా మూర్ఖా అని అరవాలి. పదిమంది తాళం కొట్టాలి. లేదా చాపకింద నీరులా స్త్రీవాదం పేరిట చొంగకార్చుడు చెయ్యగలిగే నేర్పు ఉండాలి. జనరంజకంగా కాకపోయినా మనోరంజకంగా రాయాలి కదా. ఎవరి "మనో"రంజకంగా అని అడగొద్దు. జనరంజకం కానిది మనోరంజకం ఎలా అని అడగద్దు. అది మా ఫండమెంటల్స్ మీద దెబ్బ.
ఇవన్నీ లేకపోతే...మనం ఎన్ని టపాలు రాసి ఏం లాభం!?!
మూడుకేసులూ.. ఆరు హిట్లూ!!

రహస్యపు రాతలు అనబడు అసహ్యపు రాతలు

0 comments:

Post a Comment